మీరు ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, వారు మిమ్మల్ని పట్టించుకోకుండా, గౌరవించకుండా ఉన్నారా? మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ‘ఎక్కువగా అందుబాటులో’ ఉంటామో, అప్పుడు వారు మనల్ని తేలికగా తీసుకుంటారు. కానీ, ఈ డైనమిక్ను (గతిని) తలకిందులు చేయడానికి కొన్ని శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి.
మీ ఆత్మగౌరవాన్ని తిరిగి పొంది, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారిని మీ వైపు దృష్టి సారించేలా చేసే 9 వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి:
- వ్యూహాత్మక మౌనం (Strategic Silence)
కొన్నిసార్లు మీరు ఏమి మాట్లాడారు అనే దానికంటే, ఏమి మాట్లాడకుండా ఉన్నారు అనేదే ఇతరులపై లోతుగా ప్రభావం చూపుతుంది. మీరు వారి వెనుక తిరగడం, ప్రతిదానికీ వివరణ ఇవ్వడం, ఆలోచించకుండా అన్నింటికీ సమాధానం చెప్పడం ఆపితే సరిపోతుంది. తెలివిగా ఉపయోగించే మీ మౌనం మీ ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చే శక్తివంతమైన ఆయుధం. - మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి (Prioritize Yourself)
ఇతరులు మనల్ని గౌరవించట్లేదు అని బాధపడుతూ, మనల్ని మనం చూసుకోవడం మరిచిపోతాం. ఉదయం లేవగానే మీ మనస్సుకు, శరీరానికి, పనికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు సంతోషంగా ఉండటానికి ఇతరులు అవసరం లేదు. ఇతరులు మనల్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని ఎప్పుడు అనుకుంటామో, అప్పుడే వారు మనల్ని ఎంచుకుంటారు. - నిశ్శబ్దంగా దూరం అవ్వండి (Silent Withdrawal)
మనం ఉన్నప్పుడు మన విలువ కొంతమందికి తెలియదు. మనం లేనప్పుడే ఆ లోటును అనుభవిస్తారు. అరువకుండా, కోపం తెచ్చుకోకుండా, ప్రశాంతంగా దూరంగా ఉండాలి. గౌరవం లేని చోట నేను ఉండను అని మీరు ఇచ్చే మెసేజ్ ఇది. సరైన సమయంలో సరైన దూరం పాటించడం ద్వారా, ‘మిమ్మల్ని కోల్పోయామా?’ అని వారు ఆలోచించేలా చేస్తుంది. - ఎలాంటి ప్రతిస్పందన చూపకండి (No Reaction)
మిమ్మల్ని నియంత్రించాలని భావించే వారి మాటలకు సున్నా రియాక్షన్ ఇవ్వండి. ప్రశాంతంగా, స్థిరంగా ఉండండి. భావోద్వేగాలను చూపకపోవడం మీ మనోధైర్యాన్ని చూపుతుంది. మీ మౌనం వారిని కలవరపరుస్తుంది మరియు వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. - లోపలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి (Inner Confidence)
మీరు నిజంగా మిమ్మల్ని మీరు గౌరవించడం ప్రారంభించినప్పుడు, మీ రూపం, మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ ఎంపికలపై శ్రద్ధ చూపినప్పుడు ఆత్మవిశ్వాసం దానంతటదే బయటపడుతుంది. మిమ్మల్ని గౌరవించని వారు కూడా మీలోని ఈ మార్పును గమనించడం ప్రారంభిస్తారు. - సరిహద్దులను ఏర్పాటు చేయండి (Set Boundaries)
ఇకపై దీన్ని నేను అంగీకరించను అని ఒక సరిహద్దును (Boundary) స్పష్టంగా నిర్ణయించుకోవాలి. సరిహద్దులు పెట్టడం ఇతరులను దూరం పెట్టడానికి కాదు, మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి గీసే గీత. మీ హద్దులను మీరు గౌరవించుకుంటే, ఇతరులు కూడా తప్పక గౌరవిస్తారు. - ఎంపిక చేసిన వారికి మాత్రమే మీ సమయాన్ని ఇవ్వండి (Limit Generosity)
తిరిగి ఏమీ చేయని వారిపైనా, మిమ్మల్ని గౌరవించని వారిపైనా ఉదారంగా ఉండటం మానేయండి. అవసరానికి మాత్రమే మీ వద్దకు వచ్చేవారి కోసం మీ సమయాన్ని, శక్తిని వృథా చేయకండి. నిజంగా గౌరవించే వారికి మాత్రమే మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. - శ్రద్ధ చూపడం అకస్మాత్తుగా ఆపండి (Withdraw Care)
మీరు ఒకరిపై చూపే శ్రద్ధను లేదా ప్రయత్నాన్ని అకస్మాత్తుగా ఆపినప్పుడు, అది వారిని లోతుగా ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని బాధపెట్టిన వారు చేసే ప్రయత్నాలకు ఇకపై స్పందించకూడదని మీరు తీసుకునే నిర్ణయం. ఈ సందర్భంలో, మీరు పాటించే నిర్లక్ష్యం అనేది మీ స్వేచ్ఛ అవుతుంది. - మీ విలువపై దృఢంగా ఉండండి (Be Secure in Your Value)
తాను ఎవరో తెలుసుకొని, దానిపై దృఢంగా, స్థిరంగా ఉన్న వ్యక్తి కంటే ఆకర్షణీయమైన వారు ఎవరూ ఉండరు. ఇతరులు మిమ్మల్ని మెచ్చుకోవాలని ఆశించకుండా, మీ విలువను మీరే గుర్తించి దృఢంగా ఉన్నప్పుడు, మీరు భావోద్వేగ పరంగా స్వేచ్ఛ పొందుతారు. దీని వలన మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా మిమ్మల్ని గమనించి, ఆకర్షితులవుతారు.
