మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? గూగుల్ సంస్థ బహిరంగ హెచ్చరిక..!!

గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్‌ను జారీ చేసింది. కాలం చెల్లిన పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లను నిరంతరం ఉపయోగించడం వల్ల, వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఆండ్రాయిడ్ 13 (Android 13) లేదా అంతకంటే పాత వెర్షన్లపై నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లు సరైన సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకుండా పనిచేస్తున్నాయని గూగుల్ నొక్కి చెప్పింది. ఇటువంటి ఫోన్‌లు మాల్వేర్, స్పైవేర్ మరియు రాన్సమ్‌వేర్ వంటి తీవ్రమైన వైరస్ దాడులకు సులభంగా గురవుతాయి.

గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇంకా పాత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల, హ్యాకర్లు ఈ లోపాలను ఉపయోగించుకుని వినియోగదారుల బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు మరియు వ్యక్తిగత ఫోటోలను దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనేది కేవలం ఫోన్ వేగాన్ని పెంచడానికి మాత్రమే కాదు, అది మీ డిజిల్ జీవితాన్ని రక్షించే ఒక కవచంలా పనిచేస్తుంది.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి..? ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, వినియోగదారులు వెంటనే తమ ఫోన్‌లోని ‘Settings’ లోకి వెళ్లి కొత్త అప్‌డేట్స్ ఏవైనా ఉన్నాయేమో తనిఖీ చేసి, వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో కొత్త అప్‌డేట్స్ రావడం నిలిచిపోయి ఉంటే, భద్రతా కారణాల దృష్ట్యా కొత్త మోడల్ ఫోన్‌కు మారడమే ఉత్తమమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


Posted

in

by

Tags: