బెంగళూరుకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం మీషో, జనవరి 7, 2026న సెబికి సమర్పించిన నివేదికలో మేఘా అగర్వాల్ రాజీనామాను ధృవీకరించింది. ఆమె నిష్క్రమణకు గల కారణాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.
మేఘా అగర్వాల్ ప్రస్థానం:
- కెరీర్: మేఘా 2020లో మీషోలో చేరారు. దాదాపు 6 ఏళ్ల పాటు కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, జననల్ మేనేజర్ (యూజర్ గ్రోత్) వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్టోబర్ 2023లో ఆమెను చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్‌గా నియమించారు.
- చదువు: ఆమె IIT ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధ INSEAD నుండి మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ పొందారు. మీషో కంటే ముందు నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ వంటి సంస్థల్లో పనిచేశారు.
- భారీ జీతం: 2024-25 ఆర్థిక సంవత్సరంలో మేఘా అగర్వాల్ మొత్తం వేతనం ₹2.29 కోట్లు. ఇందులో ₹9.4 లక్షల వేరియబుల్ పే కూడా ఉంది. ఒక స్టార్టప్ లీడర్‌గా ఆమె అందుకున్న ఈ భారీ ప్యాకేజీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మీషో స్టాక్ మార్కెట్ ప్రయాణం:
మీషో డిసెంబర్ 10, 2025న షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
- లిస్టింగ్: ₹111 ఇష్యూ ధరతో వచ్చిన ఐపీఓ (IPO), దాదాపు 46% ప్రీమియంతో ₹162.50 వద్ద లిస్ట్ అయ్యింది.
- మార్కెట్ క్యాప్: ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ ₹77,445 కోట్లకు చేరుకుంది.
- షేర్ ధర: శుక్రవారం (జనవరి 9) ట్రేడింగ్‌లో షేర్ ధర 4% పెరిగి ₹171.65 వద్ద కొనసాగుతోంది.
