మీ ఆరోగ్యం ఎలా ఉంది..? ” ముఖమంతా ముడతలతో వృద్ధాప్య ఛాయల్లో నటుడు సల్మాన్ ఖాన్”.. ఆందోళన చెందిన అభిమానులకు స్మార్ట్ ఫోటోతో కౌంటర్.!!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రూపం, ముఖంలో కనిపించిన మార్పులే ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా తన స్టైలిష్ లుక్‌తో, యాక్షన్ సీన్లతో అభిమానులను అలరిస్తూ వచ్చిన సల్మాన్ ఖాన్ యొక్క ఈ కొత్త రూపం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ముంబైలో జరిగిన వేడుకలో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు తీసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అందులో, 60 ఏళ్లకు దగ్గరవుతున్న సల్మాన్ ఖాన్ ముఖంలో తీవ్రమైన అలసట, వృద్ధాప్య సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆయన ముఖంలో కనిపించిన ఈ మార్పును చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వీడియో చూసిన అభిమానులు పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనను పంచుకుంటున్నారు. “మా కాలపు అత్యంత అందమైన హీరోని ఇలా చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది”, “ఆయన కళ్లలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది, ఆయనకేమైనా అనారోగ్యమా?” అంటూ రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు, “వయస్సు, యవ్వనం ఎవరికీ శాశ్వతం కాదు” అని, “ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించండి” అని కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ విమర్శలకు సల్మాన్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంటే మీ ఆరోగ్యం బాగుందా అని అడిగిన వారికి ఒక ఫోటోను విడుదల చేసి వదంతులకు ముగింపు పలికారు.


Posted

in

by

Tags: