ఇంట్లో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ల భద్రతను నిర్ధారించడానికి, వాటి పైభాగంలో ఉండే ఇనుప పట్టీపై టెస్టింగ్ (పరీక్ష) గడువు తేదీలు కోడ్‌ల రూపంలో ముద్రించబడి ఉంటాయి.
సిలిండర్లకు ప్రత్యేకంగా ఎక్స్‌పైరీ తేదీ అంటూ ఏమీ లేకపోయినా, వాటి భద్రతను నిర్ధారించడానికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ తప్పనిసరి పరీక్షను నిర్వహిస్తారు.
ఆ పట్టీపై ఉండే ‘A, B, C, D’ అనే అక్షరాలు సంవత్సరంలోని 4 త్రైమాసికాలను (ఒక్కో అక్షరం మూడు నెలల కాలాన్ని), ఆ తర్వాత వచ్చే రెండు అంకెలు ఆ సిలిండర్‌ను పరీక్షించాల్సిన సంవత్సరాన్ని సూచిస్తాయి.
ఉదాహరణకు D-26 అంటే, ఆ సిలిండర్‌ను 2026 అక్టోబర్ నుండి డిసెంబర్ నెలల మధ్యలో మళ్లీ పరీక్షకు పంపాలని అర్థం.
కాబట్టి, ఏజెన్సీ నుండి కొత్త సిలిండర్ తీసుకునేటప్పుడు, ప్రస్తుత నెల మరియు సంవత్సరం కంటే పాతబడిన (గడిచిపోయిన) కోడ్‌లు గనక ఉంటే, వాటిని తీసుకోవద్దు. ఆ సిలిండర్‌ను వెనక్కి ఇచ్చేసి వెంటనే వేరేది మార్చి ఇవ్వాలని అడగాలి.

Leave a Reply