ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించడానికి ఇప్పుడు పాత నోట్లు కూడా ఒక మార్గంగా మారుతున్నాయి. పాత వస్తువులకే కాకుండా, అరుదైన నంబర్లు కలిగిన నోట్లకు ఆన్లైన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా, ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత 5 రూపాయల నోటు మీ దగ్గర ఉంటే, అది మిమ్మల్ని లక్షాధికారిని చేసే అవకాశం ఉంది.
ఈ నోటుకు ఎందుకు అంత డిమాండ్?: ముఖ్యంగా 786 అనే సీరియల్ నంబర్ ఉండి, నోటు ఎక్కడా చిరగకుండా కొత్త దానిలా ఉంటే, దానికి కలెక్టర్ల నుండి మంచి ధర లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన అరుదైన డిజైన్లు ఉన్న నోట్లకు సుమారు రూ. 30,000 నుండి అంతకంటే ఎక్కువ ధర కూడా లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం.
ఆన్లైన్లో ఎలా అమ్మాలి?: మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. eBay లేదా CoinBazaar వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రేతగా (Seller) రిజిస్టర్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న నోటుకు సంబంధించిన స్పష్టమైన ఫోటోలను అప్లోడ్ చేసి, దాని ప్రత్యేకతలను (సంవత్సరం, సీరియల్ నంబర్) పేర్కొనాలి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.
