మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? కొత్త మార్పులు తెలుసుకోండి; లేదంటే చిక్కుల్లో పడతారు!

భారతదేశంలో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచేందుకు ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుండి దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న అనేక పరిమితులు మారనున్నాయి.

1962 నాటి చట్టం స్థానంలో కొత్త నిబంధనలు: ప్రస్తుతం కొనసాగుతున్న 1962 నాటి పాత పన్ను చట్టాల స్థానంలో 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు వస్తాయి. ఇందులో భాగంగా ఐటీ ఫారాలను సరళతరం చేస్తూ ‘స్మార్ట్ ప్రీ-ఫిల్డ్ ఫారమ్స్’ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా 2026 మార్చి మొదటి వారంలో ప్రజల అభిప్రాయం కోసం అందుబాటులోకి రానుంది.

పాన్ కార్డ్ తప్పనిసరి అయ్యే కీలక లావాదేవీలు:

  • బ్యాంక్ డిపాజిట్లు: ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాల్లో ₹10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారికి పాన్ తప్పనిసరి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా, వాటన్నింటినీ కలిపి ఈ ₹10 లక్షల పరిమితిని లెక్కిస్తారు. ప్రస్తుతం ఒకే రోజులో ₹50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా పాన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • వాహనాల కొనుగోలు: ₹5 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలను (ద్విచక్ర వాహనాలతో సహా) కొనుగోలు చేసేటప్పుడు పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం టూ-వీలర్లకు ఇది తప్పనిసరి కాదు, కానీ కొత్త సంస్కరణల్లో నిర్ణీత మొత్తం దాటితే పాన్ అడగవచ్చు.
  • హోటల్ బిల్లులు మరియు ఇతర సేవలు: హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి సేవల కోసం ₹1 లక్ష కంటే ఎక్కువ నగదు చెల్లించేటప్పుడు పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • పాన్-ఆధార్ లింకింగ్: 2026 జనవరి 1 నాటికి ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే అది పనిచేయదు. దీనివల్ల బ్యాంక్ లావాదేవీలు నిలిచిపోవడమే కాకుండా ₹1,000 నుండి ₹10,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.

Posted

in

by

Tags: