లివర్ వ్యాధి హెచ్చరిక సంకేతాలు: మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం యకృత్తు (Liver). ఇది శరీరంలోని విషపూరిత అంశాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాదాలలో కొన్ని మార్పులు కనిపించినప్పుడు, అది లివర్ సమస్యకు సంకేతం కావచ్చు అని మనం గుర్తించాలి.
పాదాల వాపు, చర్మ సమస్యలు, కాాలి వేళ్ల మధ్య పసుపు రంగు కనిపించడం వంటివన్నీ లివర్ వ్యాధులను సూచిస్తాయి. ఇటీవల విడుదలైన ‘లివర్ జనరల్’ నివేదిక ప్రకారం, పాదాలలో వచ్చే మార్పులను గమనిస్తూ మీ లివర్ ఆరోగ్యంపై నిఘా ఉంచాలని పేర్కొంది. అసలు పాదాలకు, లివర్‌కు సంబంధం ఏంటి? లివర్ పాడైతే పాదాలలో మార్పులు ఎందుకు వస్తాయో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
- పాదాలలో వాపు ఎందుకు వస్తుంది?
రోజూ నడిచేటప్పుడు పాదాలలో వాపు కనిపించినా లేదా కాళ్లు బరువుగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది లివర్ సమస్యకు ముందస్తు హెచ్చరిక. సాధారణంగా లివర్ సరిగ్గా పనిచేయకపోతే, రక్తంలోని ప్లాస్మా ఆంకోటిక్ ఒత్తిడి పెరిగి, ద్రవాలు పాదాల కీళ్లలో పేరుకుపోతాయి. దీనివల్ల వాపు మరియు అసౌకర్యం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. - చర్మం, కాాలి వేళ్లు పసుపు రంగులోకి మారుతున్నాయా?
చర్మం మరియు కాాలి వేళ్ల మధ్య పసుపు రంగు కనిపిస్తే, అది లివర్ సమస్య ఉన్నట్లు ఇచ్చే ప్రధాన సూచన. సూర్యకాంతిలో దీనిని గమనించడం మరింత సులభం. ఈ పసుపు రంగు మొదట కళ్ళలో, ఆ తర్వాత కాాలి వేళ్లలో కనిపిస్తుంది. (గమనిక: దీనినే కామెర్లు లేదా జాండిస్ అని కూడా అంటారు). - పాదాల అడుగున దురద ఉంటే నిర్లక్ష్యం వద్దు
లివర్‌లో పిత్తరసం (Bile) ప్రవాహం సరిగ్గా లేనప్పుడు పాదాల అడుగున తీవ్రమైన దురద వస్తుంది. దీనిని సాధారణ చర్మ సమస్యగా భావించకండి. రక్తంలో పిత్తరసం చేరడం వల్ల పాదాల అడుగు భాగంలో తీవ్రమైన దురద కలుగుతుంది. - సూదులు గుచ్చినట్లు అనిపిస్తే..
మీరు నడిచేటప్పుడు పాదాల కింద సూదులు గుచ్చినట్లు (Tingling sensation) అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును కలవండి. ఎందుకంటే లివర్ దెబ్బతిన్నప్పుడు శరీరంలో బి-విటమిన్ల లోపం ఏర్పడి ఈ సమస్య తలెత్తుతుంది.
పాదాలపై రక్తనాళాలు కనిపిస్తే అర్థం ఏమిటి?
మీ పాదాలు లేదా కాళ్లపై చిన్న ఎరుపు రంగులో, సాలె గూడు ఆకారంలో రక్తనాళాలు (Spider Angiomas) కనిపిస్తే, అది లివర్ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పే హెచ్చరిక కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఫ్యాటీ లివర్, మితిమీరిన మద్యపానం మరియు మధుమేహం వంటివి లివర్ సమస్యలను మరింత పెంచుతాయి.
