మీ ఫోన్‌లో ఈ 3 యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయండి! కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం మనిషికి ఆరో వేలులా మారిపోయింది. షాపింగ్ నుండి నగదు బదిలీ వరకు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రజలను అప్రమత్తం చేస్తూ మూడు స్క్రీన్ షేరింగ్ యాప్‌ల గురించి హెచ్చరించింది.

ఆ మూడు యాప్‌లు ఏవంటే? టెక్నాలజీ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ యాప్‌లను వెంటనే తొలగించాలని ప్రభుత్వం సూచించింది:

  • AnyDesk (ఎనీడెస్క్)
  • TeamViewer (టీమ్ వ్యూయర్)
  • QuickSupport (క్విక్ సపోర్ట్)

ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా ఈ యాప్‌లను ఒక చోట ఉండి మరొక చోట ఉన్న ఫోన్‌ను లేదా కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడానికి (Remote Access) ఉపయోగిస్తారు. కానీ సైబర్ నేరగాళ్లు వీటిని తప్పుగా వాడుతున్నారు:

  1. నమ్మబలుకుతారు: కస్టమర్ కేర్ ప్రతినిధులమని లేదా బ్యాంక్ అధికారులమని ఫోన్ చేసి, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయిస్తారు.
  2. యాక్సెస్ పొందుతారు: మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసి కోడ్ చెప్పగానే, మీ ఫోన్ స్క్రీన్ వారికి కనిపిస్తుంది.
  3. ఖాతా ఖాళీ: మీరు బ్యాంక్ పాస్‌వర్డ్‌లు లేదా OTPలు ఎంటర్ చేస్తున్నప్పుడు వారు వాటిని చూసి, క్షణాల్లో మీ ఖాతాలోని డబ్బును కాజేస్తారు.


Posted

in

by

Tags: