ముంబై నుంచి ఎగిరిన విమానం.. పర్వతాల్లో క్రాష్! దేశ అణుశక్తి కలలను చిదిమేసిన చరిత్రలో అత్యంత రహస్య ప్రమాదం

జనవరి 24, 1966.. ఆ చలి ఉదయం యూరప్ ఆకాశంలో ఎయిర్ ఇండియా ‘కాంచనజంగా’ విమానం తన లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. విమానంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది, కానీ అందులో భారత భవిష్యత్తుకు అతిపెద్ద కలలు కనే మేధావి డాక్టర్ హోమీ జహంగీర్ భాభా ప్రయాణిస్తున్నారు.

మరికొద్ది నిమిషాల్లో ఆ ప్రయాణం భారత విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక తీరని విషాదంగా, వీడని రహస్యంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.

ఘోర ప్రమాదం:

జెనీవాలో ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు, ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వత శ్రేణిలోని ‘మాంట్ బ్లాంక్’ శిఖరాన్ని విమానం ఢీకొట్టింది. 4,677 మీటర్ల ఎత్తులో జరిగిన ఈ భీకర ప్రమాదంలో 106 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది కలిపి మొత్తం 117 మంది మరణించారు. భారత్ కేవలం 117 ప్రాణాలను మాత్రమే కోల్పోలేదు, దేశ అణుశక్తి కార్యక్రమ రూపశిల్పి, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) వ్యవస్థాపకుడు హోమీ భాభాను కోల్పోయింది.

రెండు వారాల్లో ఇద్దరు మహనీయుల మరణం:

డాక్టర్ భాభా తన 56వ ఏట ఈ ప్రమాదంలో కన్నుమూశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ఘటనను “దేశానికి జరిగిన ఘోర విపత్తు”గా అభివర్ణించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, భాభా మరణానికి కేవలం రెండు వారాల ముందే అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతి తక్కువ కాలంలో దేశం ఇద్దరు గొప్ప వ్యక్తులను కోల్పోవడం భారత్‌కు కోలుకోలేని దెబ్బ.

18 నెలల్లో అణుబాంబు కల:

అణుశక్తి కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాదు, దేశ భద్రతకు, స్వయం సమృద్ధికి అవసరమని భాభా బలంగా నమ్మేవారు. 1965లో ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అనుమతిస్తే భారత్ కేవలం 18 నెలల్లోనే అణుబాంబు తయారు చేసి చూపిస్తుంది” అని ప్రకటించారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రకటన చేసిన మూడు నెలలకే ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది.

ప్రమాదమా? లేక CIA కుట్రనా?

ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థలు దీనిని ‘పైలట్ పొరపాటు’గా తేల్చాయి. అయితే, విమాన శకలాలు మైళ్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది.

  • CIA ప్రమేయం?: 2008లో వచ్చిన ‘Conversations with the Crow’ అనే పుస్తకం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా గూఢచారి సంస్థ CIA ఈ విమానంలో బాంబు పెట్టిందని, భారత్ అణుశక్తిగా ఎదగకుండా అడ్డుకోవడానికే ఈ కుట్ర పన్నారని ఆ పుస్తకంలో మాజీ CIA అధికారి రాబర్ట్ క్రౌలీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పేర్కొన్నారు.

Posted

in

by

Tags: