ఈ రోజుల్లో చాలా మంది ముక్కుపుడక ధరిస్తున్నారు. అయితే, ముక్కుపుడక ధరించేటప్పుడు జాగ్రత్త వహించకపోతే అది పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు.
అమృత ఆసుపత్రిలోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగం కేవలం రెండు వారాల వ్యవధిలో ముగ్గురు మహిళల ఊపిరితిత్తుల (శ్వాసకోశంలో) నుండి ముక్కుపుడక పిన్నులను తొలగించింది.
ఆ పిన్ను లోపలికి వెళ్లిందనే విషయం కూడా ఆ యువతులకు తెలియదు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన వీసా ప్రక్రియలలో భాగంగా నిర్వహించిన పరీక్షలో ఇద్దరు యువతుల ఊపిరితిత్తులలో ముక్కుపుడక పిన్ను ఉన్నట్లు కనుగొన్నారు. మరో 52 ఏళ్ల మహిళకు ఆరోగ్య పరీక్షలో భాగంగా ఎక్స్-రే తీసినప్పుడు ఆమె ఊపిరితిత్తులలో కూడా పిన్ను కనిపించింది.
వీరిలో 31 ఏళ్ల యువతి ముక్కుపుడక పిన్ను కనిపించకుండా పోయి దాదాపు రెండు సంవత్సరాలు అయినట్లు నివేదిక. ఇది ఆమె ఊపిరితిత్తుల కుడివైపు అడుగు భాగాన గుచ్చుకొని ఉంది. 44 ఏళ్ల మహిళ ఊపిరితిత్తులలో కనుగొనబడిన వెండి ముక్కుపుడక పిన్ను ఆరు నెలల క్రితం పోయింది. ఈ పిన్ను ఊపిరితిత్తులలో ఇరుక్కున్న తర్వాత, ఆ ముగ్గురికి కొద్దిపాటి దగ్గు తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని సమాచారం. నిద్రలో కూడా, మనకు తెలియకుండానే ముక్కుపుడక, పిన్నులు లేదా దాని ఇతర భాగాలు ఊపిరితిత్తులలోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
