కాన్పూర్ బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ‘దొంగ పెళ్లికూతురు’ మోసం కేసులో పోలీసులు ఓ భారీ కుట్రను ఛేదించారు.
పెళ్లి పేరుతో ముగ్గురు యువకులను మోసం చేసిన ఆ యువతి, నాలుగో యువకుడితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
విశ్వబ్యాంక్ కాలనీకి చెందిన విశాల్ విశ్వకర్మ, జుహీ లాల్ కాలనీకి చెందిన ప్రగతి విశ్వకర్మ అనే మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె సుమారు రూ.15 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదుతో పరారైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
విశాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రగతి తన మూడో భర్త అయిన విశాల్‌ను వదిలేసి నాలుగో వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ప్రగతితో పాటు ఆమె దత్తత తల్లిదండ్రులైన అశోక్ విశ్వకర్మ, సీమా (వరుసకు బావ-మరదలు), కన్నతల్లి సోమవతి, పిన్ని కోమల్ మరియు బాబాయ్ శరద్ సైనీ సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన ఆరుగురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ మోసం కేసులో ప్రమేయం ఉన్న ప్రగతి మరో పిన్ని లలిత, అత్త గోమతి విశ్వకర్మల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply