బంగ్లాదేశ్‌లోని పరిద్పూర్ జిల్లా, భాంగా ప్రాంతంలో ఒక భార్య తన భర్త నిద్రిస్తుండగా రేజర్ బ్లేడ్‌తో అతని ప్రైవేట్ పార్ట్‌ను కోసేసింది. హనీఫ్ షేక్ (30) అనే వ్యక్తి ప్రస్తుతం పరిద్పూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.
ఏం జరిగింది? ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, సోమవారం తెల్లవారుజామున హనీఫ్ నిద్రిస్తుండగా, అతని రెండో భార్య సుమయ్య అక్తర్ సుమి బ్లేడ్‌తో దాడి చేసింది. హనీఫ్ అరుపులు విని పొరుగువారు అక్కడికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భాంగా పోలీసులు సుమయ్య అక్తర్ సుమిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
భార్య ఆరోపణలు: విచారణలో సుమి పలు సంచలన విషయాలను బయటపెట్టింది. హనీఫ్ తనకు తెలియకుండా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, తన మొదటి భార్య కూడా హనీఫ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని సుమి ఆరోపించింది. పెళ్లయ్యాక కూడా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, తనను నిత్యం హింసించేవాడని, కాలుతున్న మస్కిటో కాయిల్స్‌తో తన శరీరంపై కాల్చేవాడని ఆమె వాపోయింది. సంవత్సరాలుగా భరిస్తున్న వేధింపులు, మానసిక క్షోభ వల్లనే తాను ఈ దారుణానికి ఒడిగట్టానని పోలీసులకు చెప్పింది.
పోలీసుల విచారణ: హనీఫ్‌కు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకే వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు భార్య చెప్పిన కారణాలను, ఇతర ఆధారాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.
