ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా సమీపంలోని రహన్కలాన్ గ్రామంలో, చాలా కాలంగా ప్రేమించుకుంటున్న జంట ఒకే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆ గ్రామానికి చెందిన ఇంద్రావతి అలియాస్ ఇందు (20), ప్రీతమ్ (22) అనే ఇద్దరూ గత మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే, యువకుడు ప్రీతమ్కు ఇదివరకే వివాహం జరగడంతో, వీరి ప్రేమకు ఇరువైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది.
ఈ క్రమంలో, నిన్న రాత్రి ప్రేయసి ఇంట్లోని ఒక గదిలో, ఇద్దరూ ఒకే దుపట్టాతో ఉరివేసుకుని శవాలై కనిపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఇది ఆత్మహత్య కాదని, పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని యువకుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply