మూత్ర విసర్జన లీకేజీ సమస్య..! తట్టుకోలేక చేసిన పిచ్చి పని.. చివరికి ఇరుక్కుపోయిన గ్లూ ముద్ద.. ఆపరేషన్ వరకు వెళ్లిన విచిత్ర పరిస్థితి.. అయ్యో దేవుడా..!

అమెరికాలో 41 ఏళ్ల వ్యక్తి తనకు ఎదురైన మూత్ర లీకేజీ సమస్యకు సొంతంగా పరిష్కారం వెతుక్కోబోయి తీవ్ర ప్రమాదంలో పడ్డాడు.

మూత్ర లీకేజీని అరికట్టాలనే ఉద్దేశంతో, వైద్యుడిని సంప్రదించకుండానే బలమైన గ్లూ (సూపర్ జిగురు)ను మూత్రనాళంలోకి పంపించాడు. ప్రారంభంలో లీకేజీ ఆగడంతో సమస్య పరిష్కారమైందని భావించినప్పటికీ, కొద్ది రోజుల్లోనే పరిస్థితి విషమించింది.

ఆ గ్లూ మూత్రనాళంలో గడ్డకట్టి, దాదాపు 10 సెం.మీ. పొడవైన గట్టి ముద్దలా మారింది. ఫలితంగా మూత్రం పూర్తిగా నిలిచిపోయి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. వారం రోజుల పాటు తీవ్ర నొప్పితో బాధపడినప్పటికీ ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేశాడు. నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో మూత్రనాళంలో ఏదో గట్టి పదార్థం అడ్డుపడినట్లు గుర్తించారు. అది గట్టి ముద్దలా మారడంతో సాధారణ పద్ధతుల్లో దాన్ని తొలగించడం సాధ్యం కాలేదు. దీంతో వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స (ఆపరేషన్) చేసి ఆ గ్లూ గడ్డను తొలగించారు. ఈ విచిత్ర ఘటన వైద్యులను విస్మయానికి గురిచేయడమే కాకుండా, మూత్ర సంబంధిత సమస్యలకు సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో తేటతెల్లం చేసింది.

మూత్ర లీకేజీ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఇంట్లోనే సొంత చిట్కాలు, ప్రయోగాలు చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర అంతర్గత భాగాల్లోకి బాహ్య పదార్థాలను చొప్పించడం వల్ల కణజాలం దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీల వైఫల్యం వంటి తీవ్రమైన ముప్పులు పొంచి ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అర్హులైన యూరాలజిస్ట్‌లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *