“మృగాల్లాంటి మనుషులా మీరు..?” దుకాణంలో ఉన్న వ్యక్తిపై పెట్రోల్ బాటిల్ విసిరిన దుండగులు.. ఉద్యోగిని సజీవ దహనం చేసిన కిరాతక ముఠా.. వణికిస్తున్న రౌడీయిజం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ గ్రామీణ ప్రాంతమైన కిషన్‌గఢ్ రేన్వాల్‌లోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సేల్స్‌మన్‌ను సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది.

కరాడ్ రోడ్డులో ఉన్న ఆ మద్యం దుకాణంలో ఆ సేల్స్‌మెన్ యధావిధిగా విధులు నిర్వర్తిస్తుండగా, ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.

అకస్మాత్తుగా ఆ సేల్స్‌మెన్‌పై పెట్రోల్ నింపిన బాటిల్‌ను విసిరిన ఆ దుండగులు, కనురెప్పపాటులో అతడికి నిప్పంటించారు.

దీంతో ఆ సేల్స్‌మెన్ శరీరానికి మంటలు అంటుకోగా, ఆ మంటలు మద్యం దుకాణానికి కూడా వ్యాపించి అక్కడున్న బాటిళ్లు ధ్వంసమవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం, హాహాకారాలు నెలకొన్నాయి.

తీవ్రంగా గాయపడిన అతడిని రక్షించి జైపూర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న కిరాతక నేరస్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *