మెడలోని చైన్ గుంజుకొని పారిపోయిన దొంగ..! వెంటపడి వేటాడిన మహిళ..! చూస్తూ ఉండిపోయిన జనం.. చైన్ పోయినా ధైర్యం వీడలేదు.!!!

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని దుర్గాపురా మార్కెట్ ప్రాంతంలో ఒక మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మార్కెట్‌లో జనాంచారం ఎక్కువగా ఉన్న సమయంలో, ఒక అపరిచిత వ్యక్తి ఆ మహిళ మెడలో ఉన్న చైన్‌ను లాక్కెళ్లాడు. చైన్ లాక్కోగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి వేగంగా పారిపోవడం ప్రారంభించాడు.

ఆ సమయంలో, ఆ మహిళ దొంగను వదిలిపెట్టకుండా అతని వెంటే పరుగెత్తింది. చుట్టూ చాలా మంది ఉన్నప్పటికీ, ఆమె ఒక్కతే ధైర్యంగా దొంగను పట్టుకోవడానికి వెంటపడింది. ఈ ఘటన చూసి కొంతమంది దిగ్భ్రాంతి చెందగా, ఆ మహిళ మాత్రం విడవకుండా దొంగను తరుముతూనే ఉంది.

ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అందులో, చైన్ లాక్కొని పారిపోతున్న వ్యక్తి వెనకాలే ఆ మహిళ పరుగెడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఎవరు అనేదానిపై పోలీసులు గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ మహిళ ధైర్యంగా దొంగను తరిమిన తీరు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *