మేక శరీరంపై డాలర్ నోట్లు అంటించి రోడ్డుపై వదిలేసిన మహిళ.. వాహనం ఢీకొని మూగజీవి మృతి!

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం హియాలియా ప్రాంతంలో 34 ఏళ్ల అలియాన్ డి లా కరిడాడ్ ట్రిస్టా అనే మహిళ ఓ మేక శరీరంపై డాలర్ నోట్లను అంటించిన ఘటన కలకలం రేపింది.

ఇందుకోసం ఆమె వేడి గమ్ (హాట్ గ్లూ) ఉపయోగించినట్లు తెలుస్తోంది. మేక శరీరం నిండా డబ్బు అంటించి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గత అక్టోబర్ 30న శరీరంపై డాలర్ నోట్లతో ఆ మేక వీధుల్లో తిరుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా, ఆ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా మేక శరీరంపై డబ్బు అంటిస్తున్న దృశ్యాలను షేర్ చేసినట్లు అరెస్ట్ వారెంట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, వెస్ట్‌ల్యాండ్ మాల్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపై ఆ మేకను ఒంటరిగా వదిలేసి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వాహనం మేకను ఢీకొట్టడంతో అది మృతి చెందింది. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన దాదాపు రెండు వారాల తర్వాత పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. మూగజీవిని హింసించి, దాని మృతికి కారణమైనందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. మేక శరీరంపై డబ్బు అంటించి రోడ్డుపై వదిలేసిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *