“మేము ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం!”.. ఐటీ పని ఒత్తిడి ఒక కుటుంబాన్నే బలితీసుకుందా?.. ఐఐఎం పూర్వ విద్యార్థి పంపిన భయానక ఈ-మెయిల్..!!

ఐటీ రంగంలో అధిక జీతాలతో పాటు విపరీతమైన మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, గురుగ్రామ్‌లో ఓ ఐటీ ఉద్యోగి తన భార్యను చంపి, అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.

కేరళకు చెందిన మహమ్మద్ అస్లాం, ఆయన భార్య ఫర్హానా.. మూడు నెలల క్రితమే బెంగళూరు నుంచి బదిలీపై వచ్చి గురుగ్రామ్‌లోని సెక్టార్ 68లో ఉన్న ఒక నివాసంలో అద్దెకు దిగారు.

ఐఐఎం ఇండోర్ (IIM Indore) పూర్వ విద్యార్థి అయిన అస్లాం, ఆత్మహత్యకు ముందు తన ఆఫీస్‌కు “మేము ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం” అంటూ ఒక ఈ-మెయిల్ పంపాడు. ఆ మెయిల్ చూసి దిగ్భ్రాంతి చెందిన తోటి ఉద్యోగులు వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన వెళ్లి పరిశీలించడంతో ఈ హృదయ విదారక విషాదం వెలుగులోకి వచ్చింది.

భార్య పుట్టినరోజే ఈ ఘోరం చోటుచేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. భార్య దుస్తులపై పెన్నుతో ‘ఐ లవ్ యూ’ అని రాసి ఉండటంతో పాటు, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతుల మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేనప్పటికీ, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా అస్లాం గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర మానసిక కుంగుబాటుకు (డిప్రెషన్) చికిత్స పొందుతున్నట్లు తేలింది.

ఐటీ రంగంలోని తీవ్ర పనిభారమే ఈ విపరీత నిర్ణయానికి దారితీసిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *