పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ధనంజయ డి సిల్వా, పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రజావుల్లా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మ్యాచ్ 70వ ఓవర్లో రజావుల్లా వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసురుతూ ధనంజయను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఒక్కసారిగా తీవ్రమైన మాటల యుద్ధం మొదలైంది.
యువ బౌలర్ రజావుల్లా కోపంతో ఊగిపోతూ అరవగా.. అనుభవజ్ఞుడైన ఆటగాడు ధనంజయ డి సిల్వా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చిరునవ్వుతోనే ఆ బౌలర్‌కు దీటుగా బదులిచ్చాడు.
మైదానంలో వీరిద్దరూ ముఖాముఖి తలపడిన ఈ ఉత్కంఠభరిత వీడియో సోషల్ మీడియాలో విడుదలై ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉద్రిక్త వాతావరణంలోనూ ఎంతో కూల్‌గా ఆడిన ధనంజయ.. బౌలర్ మాటల దాడిని పట్టించుకోకుండా తన అద్భుతమైన ఆటతీరుతో మైదానంలోనే తగిన సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

Leave a Reply