“మొదటి రాత్రి గదిలోకి అత్తగారు.. గుడారాల్లో యువత.. ప్రపంచాన్ని విస్మయపరిచే వింత ఆచారాలు! ఎక్కడో తెలుసా?”

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, వేలకొద్దీ సంస్కృతులు ఉన్నాయి. మనం జీవించే జీవనశైలిని దాటి చూస్తే, కొన్ని ప్రాంతాల ఆచారాలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. కొన్ని ఆచారాల గురించి వింటే, “ఇలా కూడా జరుగుతుందా?” అనిపిస్తుంది. అటువంటి ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఆఫ్రికా గిరిజన ఆచారం: ఆఫ్రికాలోని ఒక గిరిజన గ్రామంలో, వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి వధూవరులతో పాటు వధువు తల్లి (అత్తగారు) కూడా వెళ్తారు. సాధారణంగా మొదటి రాత్రి అంటే దంపతులకు తప్ప ఎవరికీ అనుమతి ఉండదు. కానీ, ఈ గిరిజన ప్రజల మధ్య ఇది ఒక ముఖ్యమైన ఆచారం. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో వధువుకు ఏమైనా భయం లేదా సంకోచం ఉంటే, దాన్ని తొలగించడానికి మరియు వైవాహిక జీవితం గురించి అవగాహన కల్పించడానికి తల్లి లోపలికి వెళ్తుందట. ఒకవేళ తల్లి లేకపోతే, కుటుంబంలోని పెద్ద వృద్ధురాలు ఈ బాధ్యతను తీసుకుంటుంది.

నమీబియాలోని వింత ఆచారం: నమీబియాలో నివసించే “హింబా” (Himba) అనే గిరిజనులలో “ఒకుజెపిసా ఒముకజెందు” (Okujepisa omukazendu) అనే ఒక వింత ఆచారం ఉంది. దీని అర్థం “భార్యను పంచుకోవడం”. తమ ప్రాంతానికి వచ్చే అతిథులకు లేదా పర్యాటకులకు, అక్కడి పురుషులు తమ భార్యలను తాత్కాలికంగా పంచుకోవడం ఒక సామాజిక ఆచారంగా ఉంది. అయితే, ఇది హింబా తెగలోని అందరూ అనుసరించే ఆచారం అని చెప్పలేము.

ఇండోనేషియాలో ఒప్పంద వివాహాలు: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రాంతంలో ఉన్న “పున్కాక్” అనే కొండ ప్రాంతంలో జరిగే విషయం మరీ విచిత్రంగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఆచారం కంటే పర్యాటక వ్యాపారంతో ముడిపడి ఉంది. దీన్ని “కాంట్రాక్ట్ మ్యారేజ్” అని పిలుస్తారు. అక్కడికి వచ్చే పర్యాటకులు స్థానిక మహిళలను తాత్కాలికంగా వివాహం చేసుకుంటారు. ఆ పురుషుడు తిరిగి వెళ్లిపోయేటప్పుడు ఆ మహిళకు కొంత డబ్బు ఇచ్చి విడిపోతాడు. ఆ తర్వాత ఆ మహిళ మరొక పర్యాటకుడిని ఇలాగే పెళ్లి చేసుకుంటుంది.

భారతదేశంలో ‘గోతుల్’ వ్యవస్థ: ఆఫ్రికా, ఇండోనేషియా కంటే మన భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్, బస్తర్ ప్రాంతంలో నివసించే “మురియా” అనే గిరిజనులలో “గోతుల్” అనే ఆచారం ఉంది. యుక్తవయసు వచ్చిన బాలురు, బాలికలు కలిసి ఉండటానికి గ్రామ మధ్యలో ప్రత్యేకంగా “గోతుల్” అనే మట్టి గుడిసెలు నిర్మిస్తారు. ఇక్కడ బాలురను “చెలిక్” అని, బాలికలను “మోడియారి” అని పిలుస్తారు. ఇక్కడ యువతకు తమకిష్టమైన భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకరితో విసుగు వస్తే మరొకరిని ఎంచుకోవచ్చు. అయితే, కొందరు వ్యక్తులతో మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండకూడదనే వింత నిబంధనలు కూడా అక్కడ ఉన్నాయి.


Posted

in

by

Tags: