మధ్యప్రాచ్యంలో యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో నివసించే కుర్దిష్ ప్రజలు, అమెరికా రహస్య ఆయుధ సహాయంతో మరో రెండు మూడు రోజుల్లో అతిపెద్ద ఉంట్రగత విప్లవాన్ని (Civil War) ప్రారంభించనున్నట్లు దిగ్భ్రాంతికరమైన వార్తలు వస్తున్నాయి.
ముఖ్యమైన పరిణామాలు:
అంతర్గత తిరుగుబాటుకు ప్లాన్: ఇరాన్‌లోని ప్రస్తుత ఇస్లామిక్ పాలనను అంతం చేసి, ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపునిచ్చారు. దీనికి మద్దతుగా కుర్దిష్ తిరుగుబాటుదారులకు అమెరికా ఆయుధాలను సరఫరా చేస్తోంది.
నాయకత్వంపై దాడి: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడానికి టెహ్రాన్‌లో మత గురువులు సమావేశమైన భవనాన్ని అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు క్షిపణులతో నేలమట్టం చేశాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత కొత్త నాయకత్వం రాకుండా అడ్డుకోవడమే ఈ దాడి లక్ష్యం.
ట్రంప్ కఠిన హెచ్చరిక: “ఇరాన్ వాయుసేన, నావికాదళం మరియు నాయకత్వం పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. వారు ఇప్పుడు శాంతి చర్చలు కోరుకుంటున్నారు, కానీ దానికి సమయం మించిపోయింది” అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
ఇరాన్ ప్రతిదాడి: ఇరాన్ తన డ్రోన్లతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని చమురు శుద్ధి కర్మాగారాలు మరియు ఖతార్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరంపై దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి: ఇటు ఇజ్రాయెల్ తన సైన్యాన్ని లెబనాన్ సరిహద్దుల్లోకి పంపి భూతల దాడులను తీవ్రం చేసింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.

Leave a Reply