యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి భారత్ భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల భారతదేశానికి బంగారు సరఫరా గణనీయంగా పెరుగుతుంది, ఫలితంగా దేశీయంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో బంగారం లభ్యత చాలా తక్కువ కాబట్టి, అవసరాలను తీర్చడానికి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాము. ఆభరణాలు, పెట్టుబడులు మరియు పండుగలు, వివాహాల కోసం భారత్‌లో బంగారానికి ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
విక్రయాలు ఎందుకు తగ్గాయి? గత వారంలో బంగారం ధరలు వేగంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఆకస్మిక మార్పుల వల్ల కస్టమర్లు బంగారం కొనడానికి వెనుకాడతున్నారు. కొన్ని వారాల క్రితం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.33 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం అది రూ. 1.54 లక్షల వరకు పెరిగింది. ఈ భారీ ధరల పెంపు సామాన్యులను షాక్‌కు గురిచేసింది. అమ్మకాలను పెంచడానికి జువెలర్స్ మేకింగ్ ఛార్జీలపై భారీ తగ్గింపులు ఇస్తున్నప్పటికీ, దుకాణాల్లో రద్దీ తక్కువగానే ఉంది.
భారత్ ఎక్కడి నుండి బంగారం కొనుగోలు చేస్తుంది? భారత్ తన బంగారు అవసరాల కోసం ప్రధానంగా ఐదు దేశాలపై ఆధారపడి ఉంది:
- స్విట్జర్లాండ్: భారత్‌కు అతిపెద్ద సరఫరాదారు. 2024లో ఇక్కడి నుండి సుమారు $19.6 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాము.
- UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్): దుబాయ్ బంగారం వ్యాపారానికి ప్రధాన కేంద్రం. కుదిరిన వాణిజ్య ఒప్పందాల వల్ల ఇక్కడి నుండి బంగారం కొనుగోలు సులభంగా మారింది.
- దక్షిణాఫ్రికా: బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ దేశం భారత్‌కు ఒక ముఖ్య వినయోగదారు.
- ఆస్ట్రేలియా మరియు పెరూ: ఈ దేశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద నిల్వలు: భారత రిజర్వ్ బ్యాంక్ అమెరికా మరియు బ్రిటన్ బ్యాంకుల నుండి తన బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడం ప్రారంభించింది. మార్చి నుండి డిసెంబర్ 2025 మధ్య దాదాపు 80 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించారు. ప్రస్తుతం దేశీయంగా నిల్వ ఉన్న బంగారం 600 టన్నులకు చేరింది. డిసెంబర్ 2025 చివరి నాటికి భారత్ వద్ద మొత్తం 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
