యుద్ధనౌకలను పంపండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతాం! – నాటో దేశాలను బతిమాలిన ట్రంప్.. అసలేం జరిగింది?

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు తలపడుతుండటంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీని ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ను ఇరాన్ దిగ్బంధించింది. ఫలితంగా చమురు సరఫరా నిలిచిపోయి, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ట్రంప్ ‘ఆర్డర్’: ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. “ఈ మార్గం ద్వారా చమురు పొందే దేశాలు కేవలం వేడుక చూస్తే ఎలా? మీ దేశ చమురు నౌకల రక్షణ కోసం మీరే యుద్ధనౌకలను పంపండి” అని ఆసియా, యూరప్ దేశాలకు డెడ్ లైన్ విధించారు. ముఖ్యంగా నాటో (NATO) దేశాలు సహాయం చేయకపోతే, ఆ కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తూనే, మరోవైపు బతిమాలుతున్నట్లుగా మాట్లాడారు.

నழுగుతున్న దేశాలు: ట్రంప్ ఇంతలా కోరుతున్నా.. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ మరియు బ్రిటన్ వంటి దేశాలు యుద్ధనౌకలను పంపే ఉద్దేశం లేదని తప్పించుకుంటున్నాయి.

  • జపాన్: తమ దేశ చట్టాల ప్రకారం సైన్యాన్ని పంపడం కష్టమని చెబుతూ, కొరతను అధిగమించేందుకు తమ వద్ద ఉన్న ఎమర్జెన్సీ చమురు నిల్వలను వాడటం మొదలుపెట్టింది.
  • బ్రిటన్: నౌకలను పంపితే యుద్ధం మరింత తీవ్రమవుతుందని, కేవలం గనులను తొలగించే సాంకేతిక సాయం మాత్రమే చేస్తామని పేర్కొంది.

చైనాకు చెక్: ట్రంప్ తన తదుపరి లక్ష్యంగా చైనాను ఎంచుకున్నారు. “చైనాకు అవసరమైన 90% చమురు ఈ మార్గం నుండే వెళ్తుంది. కాబట్టి వారు కూడా రంగంలోకి దిగాలి. లేదంటే జి జిన్‌పింగ్‌తో జరగాల్సిన చర్చలను వాయిదా వేస్తాను” అని హెచ్చరించారు.

ఇరాన్ మొండితనం: అమెరికా దాడుల వల్ల ఇరాన్ నౌకాదళం దెబ్బతిన్నప్పటికీ, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాత్రం తగ్గేదేలేదంటున్నారు. “మేము ఎవరినీ యుద్ధ విరమణ కోరడం లేదు, చర్చలకు రాము. మమ్మల్ని మేము రక్షించుకోగలము” అని ధీమా వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: