“యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కఠిన చట్టాలు!” – ఒకే ఒక్క తప్పుతో జీవితాన్ని కోల్పోయిన భారతీయ యువకుడు. 4 నెలలుగా దుబాయ్ జైలులో మగ్గుతున్న దయనీయ స్థితి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం..!!

దుబాయ్‌కి ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు, కంపెనీకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా పని మానేసి వచ్చేయాలని ప్రయత్నించడంతో, అక్కడి అల్ రషీదియా జైలులో బందీ అయ్యాడు.

పలాము జిల్లాకు చెందిన లల్లన్ పాశ్వాన్ కుమారుడు శశి కుమార్ పాశ్వాన్ (23), 2025లో దుబాయ్‌లోని ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీలో పనికి చేరాడు.

శశి తన చెల్లెలి వివాహం కోసం తిరిగి భారతదేశం రావాల్సి ఉండగా, కంపెనీ నుండి అధికారికంగా అనుమతి పొందడంలో జాప్యం జరిగింది. దీంతో ఒక ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించిన అతను, ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి ఎలాగైనా సొంత ఊరికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కఠినమైన కార్మిక చట్టాల ప్రకారం.. కంపెనీకి సమాచారం ఇవ్వకుండా పనికి డుమ్మా కొట్టడం లేదా అకస్మాత్తుగా పనిని వదిలేసి పారిపోవడాన్ని (absconding) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగా, దుబాయ్ పోలీసులచే అరెస్టు చేయబడిన శశి గత నాలుగు నెలలుగా జైలులో మగ్గుతున్నాడు.

తమ కొడుకు త్వరలో విడుదలవుతాడనే ఆశతో నాలుగు నెలలుగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులు, ప్రస్తుతం ఎలాంటి పురోగతి లేకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కుమారుడిని సురక్షితంగా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని అతని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమై భారత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


Posted

in

by

Tags: