కర్ణాటకలో నిండు గర్భిణీ కడుపుపై దాడి చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.
ఆ గర్భిణీకి ఎలాంటి పెద్ద గాయాలు లేదా రక్తస్రావం కాలేదని, ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినందున హత్యాయత్నం సెక్షన్ను (కేసును) రద్దు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు.
కానీ, ఈ వాదనను అంగీకరించడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ అనంత్ రామనాథ్ హెగ్డే.. తీవ్రమైన గాయాలు కాలేదన్న ఒకే ఒక్క కారణంతో గర్భిణీ కడుపుపై చేసిన దాడిని హత్యాయత్నంగా పరిగణించలేమని చెప్పలేమని స్పష్టం చేశారు.
బాధితురాలు నిండు గర్భిణీగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగినందున, తల్లీబిడ్డలకు పెద్దగా హాని జరగలేదన్న ఒకే కారణంతో కేసును కొట్టివేయలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
దీంతో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను కింది కోర్టు (విచారణ న్యాయస్థానం) పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటుందని ఆదేశించింది.

Leave a Reply