సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఐశ్వర్య, సౌందర్య అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి ఐశ్వర్య నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుని, కొన్ని ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇక చిన్న కుమార్తె సౌందర్య కూడా తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత, నటుడు విశాఖన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి సమయంలో విశాఖన్ “తాళి కట్టను” అని చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వైరల్ అవుతున్న సౌందర్య ఇంటర్వ్యూ: సౌందర్య ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి విశేషాలను పంచుకుంటూ.. “మా పెళ్లి ముహూర్త సమయం ఆసన్నమైంది. కానీ నా మొదటి కుమారుడు వేద్ కృష్ణ ఇంకా మండపానికి రాలేదు. దీంతో నేను ఆందోళన చెందుతూ మా అక్కను అడిగాను. అప్పుడు విశాఖన్ నాతో.. ‘వేద్ వచ్చే వరకు నేను నీకు తాళి కట్టను’ అని ఖరాకండిగా చెప్పారు. వేద్ వచ్చిన తర్వాతే ఆయన నా మెడలో తాళి కట్టారు.” అని తెలిపారు.
మేమంతా ఒక్కటే: ఆమె ఇంకా మాట్లాడుతూ.. “మొదటి నుంచే మేమంతా ఒక్కటే అన్నట్లుగా ఉన్నాం. పిల్లలకు అన్నీ తెలుస్తాయి, వారి ముందు మనం అబద్ధాలు ఆడలేం. విశాఖన్ తనను బాగా చూసుకుంటాడని వేద్‌కు అర్థమైంది. వేద్ సమక్షంలోనే విశాఖన్ పెళ్లి చేసుకోవడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం” అని పేర్కొన్నారు.
నిర్మాతగా సౌందర్య: సౌందర్య కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసి, ఆ తర్వాత ‘గోవా’ సినిమాను నిర్మించారు. అనంతరం ‘కోచడయాన్’, ‘వీఐపీ 2’ సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె, ఇటీవల నిర్మాతగా మారి రూపొందించిన ‘విత్ లవ్’ (With Love) చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం విశేషం.
