నటుడు సూర్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ వైఖరి గురించి బహిరంగంగా మాట్లాడారు.
“పొరపాటున కూడా నేను రాజకీయాల వైపు అడుగుపెట్టను. నా మనసుకు నచ్చిన పనులు చేయడానికే నేను ఎప్పుడూ ఇష్టపడతాను” అని ఆయన స్పష్టం చేశారు.
తాను రాజకీయాల్లోకి రానని చెప్పినంత మాత్రాన, రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని అర్థం కాదని సూర్య వివరించారు. “నేను మౌనంగా, నిశితంగా రాజకీయాలను గమనిస్తూనే ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.
పూర్తి అంకితభావంతో ప్రజాసేవ చేయాలనుకునే వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని తెలిపిన ఆయన.. యువత రాజకీయాల్లోకి వచ్చే ముందు అక్కడి విధివిధానాలు, సవాళ్లు, సాధకబాధకాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.
కేవలం మార్పు కావాలని నినాదాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, నిజమైన మార్పును కోరుకునే వారు ముందుగా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూర్య స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply