ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకిలో పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళను, ఆమె భర్తే కిరాతకంగా హత్య చేసి మామగారికి ఫోన్ చేసి సమాచారం చెప్పిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
సందీప్ వర్మ అనే ఆటో డ్రైవర్, సీమా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుని 8 ఏళ్ల కుమార్తెతో నివసిస్తున్నారు. అయితే, సీమా పురుష మిత్రుడు తరచుగా ఇంటికి రావడం, అలాగే ఆమె 10 రోజుల పాటు స్నేహితుడి వద్దకు వెళ్లి ఉండటంపై దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
ఘటన జరిగిన రోజు సీమా పేరు మీద ఉన్న ఒక స్థలానికి సంబంధించి ఇద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. ఈ క్రమంలో సందీప్ తన కుమార్తెను ట్యూషన్‌కు పంపి, ఇంట్లో సీమాను కొట్టి చంపి, తాళం వేసి పరారయ్యాడు.
అర్ధరాత్రి 12:30 గంటలకు సందీప్ తన మామగారికి ఫోన్ చేసి “నీ కూతుర్ని చంపేశాను” అని చెప్పినప్పటికీ, అతను మత్తులో వాగుతున్నాడని భావించి కుటుంబ సభ్యులు దానిని పెద్దగా పట్టించుకోలేదు.
మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు వెళ్లి చూడగా సీమా రక్తపు మడుగులో శవమై పడి ఉండటం వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న సందీప్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply