భారత క్రికెట్ జట్టులో విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ (62) శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన నాలుగో దశ (Stage-4) లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాన్‌చంద్ సింగ్ తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో పాటు నిరంతర కిడ్నీ డయాలసిస్ (CRRT) చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏడాది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మరణం సంభవించింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 లో రింకూ సింగ్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. తన తండ్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసి, చెన్నైలో ఉన్న జట్టు క్యాంప్ నుండి రింకూ అత్యవసరంగా గ్రేటర్ నోయిడాకు వెళ్లారు. జింబాబ్వేతో జరగాల్సిన కీలకమైన సూపర్-8 మ్యాచ్‌కు ముందు ఆయన తన కుటుంబం దగ్గరకు చేరుకున్నారు.
అయితే, ఆ తర్వాత ఆయన మళ్ళీ జట్టుతో చేరారు. కానీ శుక్రవారం తన తండ్రి మరణించడంతో, రింకూ సింగ్ మళ్ళీ జట్టును వీడే అవకాశం ఉంది. ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్ తదుపరి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. రింకూ తన కుటుంబ కార్యక్రమాలు ముగించుకుని తర్వాత జట్టుతో కలిసే అవకాశం ఉంది.

Leave a Reply