టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో తన 350వ వికెట్ పడగొట్టి అరుదైన చారిత్రక మైలురాయిని చేరుకున్నాడు.
దీంతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4,000కు పైగా పరుగులు చేసి, 350కి పైగా వికెట్లు తీసిన ప్రపంచంలోనే నాల్గవ ఆల్‌రౌండర్‌గా జడేజా రికార్డు సృష్టించాడు.
ఈ ఎలైట్ క్లబ్లో ఉన్న దిగ్గజాలు:
- కపిల్ దేవ్ (భారత్): 131 టెస్టుల్లో 5,248 పరుగులు & 434 వికెట్లు
- ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్): 102 టెస్టుల్లో 5,200 పరుగులు & 383 వికెట్లు
- డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 113 టెస్టుల్లో 4,530 పరుగులు & 362 వికెట్లు
- రవీంద్ర జడేజా (భారత్): 4,000+ పరుగులు & 350 వికెట్లు
ఈ నలుగురు గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో 100 కంటే తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా చరిత్రకెక్కడం విశేషం.
