సోషల్ మీడియాలో లైక్లు, ఫాలోవర్లను పెంచుకోవాలనే వెర్రితో నేటి యువత చేసే ప్రమాదకర పనులు హద్దులు దాటిపోతున్నాయి.
ఎత్తైన భవనాల అంచులపై నిలబడటం, కదులుతున్న వాహనాల్లో స్టంట్లు చేయడం వంటి ప్రమాదకర వ్యామోహం, ఇప్పుడు ఏకంగా వన్యప్రాణుల ఆవాసాలకే వెళ్లి వాటిని రేకెత్తించేంత తీవ్ర రూపాన్ని దాల్చింది.
ఆ క్రమంలో, ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, సోషల్ మీడియా ప్రియులకు ఒక పెద్ద హెచ్చరికను జారీ చేస్తోంది.
ఈ వైరల్ వీడియో ప్రారంభంలో, ఒక బహిరంగ ప్రదేశంలో ఒక భారీ ఎలుగుబంటి ఎంతో ప్రశాంతంగా నిలబడి ఉండటాన్ని స్పష్టంగా చూడవచ్చు.
అప్పుడు అక్కడికి వచ్చిన ఒక యువకుడు, సోషల్ మీడియా కోసం రీల్ తీసే ఉత్సాహంలో చేతిలో కెమెరాతో ఆ ప్రమాదకరమైన ఎలుగుబంటికి అత్యంత దగ్గరగా వెళ్లాడు. ప్రారంభంలో ఆ జంతువు ఎలాంటి కదలిక లేకుండా ప్రశాంతంగా ఉండటంతో, తనకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ వ్యక్తి తప్పుగా అంచనా వేశాడు. కానీ, అడవి జంతువుల మనస్తత్వాన్ని ఎప్పుడూ ఊహించలేమనే నిజానిని అతను పూర్తిగా మరచిపోయాడు.
కొద్ది సెకన్లలోనే ప్రశాంతంగా ఉన్న ఆ పెద్ద ఎలుగుబంటి ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆ యువకుడి వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇది చూసిన ఆ వ్యక్తి ధైర్యమంతా నీరుగారిపోయి, తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుండి కేకలు వేస్తూ పరుగులు తీశాడు.
ఇదిలా ఉంటే, ఎక్స్ ప్లాట్ఫామ్లో jamalk38 అనే ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో, కేవలం కొన్ని సెకన్ల ప్రసిద్ధి కోసం ప్రజలు ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎత్తిచూపుతూ నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.

Leave a Reply