మెక్సికోలో కొత్త రైలు మార్గం ప్రారంభోత్సవ వేడుకలో ఆ దేశ మేయర్ అనుకోకుండా ఆలస్యంగా చేరుకున్నారు. ఆయన రాకముందే రైలు బయలుదేరడంతో, ఎలాగైనా దాన్ని అందుకోవాలనే ఆరాటంతో ఆయన రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పరుగెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం ఎక్స్ (X) వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భారతీయ పరిస్థితులతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే.. మంత్రి కోసం వేచి ఉండకుండా రైలును నడిపినందుకు సదరు డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేసేవారని లేదా ఉద్యోగం నుండి తొలగించేవారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మెక్సికో దేశం పాటిస్తున్న సమయపాలనను (Time Management), చట్టం ముందు అందరూ సమానమే అనే నిబద్ధతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
