కెనడాలోని టొరంటోలో ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తున్న హేకి జియాంగ్ (Heiki Jeong), దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి కంటెంట్ క్రియేషన్‌ను ఎంచుకుంది.
స్థిరమైన, అధిక ఆదాయాన్ని వదులుకుని ఆమె ఎంచుకున్న ఈ కొత్త దారి ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉద్యోగం వదిలేసిన తర్వాత, ఒక సంవత్సరం పాటు పూర్తిస్థాయిలో కంటెంట్ క్రియేషన్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రారంభంలో దీని నుంచి వచ్చిన రాబడి చాలా తక్కువగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం, ఒకానొక దశలో నెలకు కేవలం రూ. 500 మాత్రమే సంపాదించగలిగింది.
అంతటి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, ఆమె ఎందుకు ఇలాంటి రిస్క్‌తో కూడుకున్న నిర్ణయం తీసుకుందనేది చాలామందిలో ఆసక్తిని రేకెత్తించింది. రోజువారీ సాధారణ ఉద్యోగానికి బదులుగా, తనకు ఇష్టమైన రంగంలో ప్రయత్నించేందుకు ఈ ఒక ఏడాది కేటాయించినట్లు సమాచారం.
ఈ కథనం.. “ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగం కావాలా? లేదా తనకు ఇష్టమైన పని చేయాలా?” అనే అంశంపై వ్యక్తిగత ఎంపిక ప్రాధాన్యతను చర్చనీయాంశంగా మార్చింది. అదే సమయంలో, స్థిరమైన ఆదాయాన్ని వదులుకుని కొత్త రంగంలోకి అడుగుపెట్టడం అనేది ఆర్థికంగా పెద్ద రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సొంత ఆర్థిక పరిస్థితిని, భవిష్యత్ ప్రణాళికను జాగ్రత్తగా సమీక్షించుకోవడం చాలా అవసరం

Leave a Reply