రూ.100 మరియు రూ.500 నోట్ల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. పాత నోట్లు చెల్లుతాయా లేదా అనే విషయంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానం ఇచ్చింది.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలు, చిల్లర వ్యాపారులు, రవాణా మరియు చిన్న దుకాణాలలో నగదు లావాదేవీలే నేటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న రూ.100, రూ.500 నోట్లలో త్వరలో కొన్ని మార్పులు రానున్నాయి. భద్రతా ఫీచర్లను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది.
కీలక మార్పులు మరియు భద్రత: కళ్ళ నోట్లను (నకిలీ నోట్లు) అరికట్టడానికి మరియు నోట్ల జీవితకాలాన్ని పెంచడానికి కొత్త భద్రతా ఫీచర్లు జోడించబడుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు అసలు నోట్లను సులభంగా గుర్తించవచ్చు. అయితే, ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత నోట్లు రద్దవుతాయా అనే ప్రశ్నకు.. అవి యథావిధిగా చెల్లుబాటు అవుతాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి.
- రూ.100 నోటు: దీని రూపకల్పనలో (Design) పూర్తి మార్పులు చేయలేదు. కేవలం ప్రింటింగ్ స్పష్టత, సిరా నాణ్యత మరియు కాగితం నాణ్యతను మెరుగుపరిచారు. వాటర్ మార్క్ మరియు సెక్యూరిటీ త్రెడ్ స్పష్టంగా కనిపించేలా మార్పులు చేశారు.
- రూ.500 నోటు: అధిక విలువ కలిగిన ఈ నోట్లు నకిలీల బారిన పడకుండా ఉండేందుకు మైక్రో ప్రింటింగ్, రంగుల కలయిక మరియు డిజైన్ వివరాలను మరింత క్లిష్టంగా మార్చారు.
పాత మరియు కొత్త నోట్లు రెండూ కూడా ఏటీఎంలు మరియు బ్యాంకులలో ఆమోదించబడతాయి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
