“రూ. 5000 టికెట్ వేస్ట్..!” దసరాకు సొంతూరు వెళ్లాలనుకున్న బెంగళూరు ఉద్యోగికి షాకిచ్చిన బాస్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగి.. రెడిట్‌లో పెద్ద ఎత్తున చర్చ..!!

బెంగళూరులోని ఓ రిటైల్ (చిల్లర వ్యాపార) సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, దసరా పండుగను కుటుంబంతో కలిసి సొంతూరిలో జరుపుకునేందుకు రూ. 5,000 ఖర్చు చేసి ముందుగానే ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు.

సంస్థలో చేరి నాలుగు నెలలే అయినప్పటికీ, సొంతూరుకు వెళ్లేందుకు ప్రణాళిక చేసుకున్న ఆ ఉద్యోగికి అతడి మేనేజర్ ఊహించని షాక్ ఇస్తూ, పనితీరు మెరుగుదల పథకంలో (పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ – PIP) పెట్టినట్లు ప్రకటించాడు.

దసరా పండుగ కోసం రెండు రోజులు సెలవు కావాలని ఆ ఉద్యోగి అడగగా, ప్రస్తుతం నువ్వు పీఐపీ (PIP)లో ఉన్నందున సెలవు ఇవ్వడం కుదరదని మేనేజర్ తేల్చి చెప్పాడు.

అయితే, తనకు అధికారికంగా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మేనేజర్ అకస్మాత్తుగా ఇలాంటి చర్య తీసుకోవడం ఆ ఉద్యోగిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.

ఈ వివరాలను అతడు ‘రెడిట్’ (Reddit) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకోగా, ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా ఎగవేసేందుకు సంస్థలు ఆడే నాటకం (ట్రిక్) ఇదేనంటూ నెటిజన్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై మండిపడుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *