రెండు నిమిషాల్లో నిద్ర గ్యారెంటీ! సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘మిలిటరీ స్లీప్ మెథడ్’ మిమ్మల్ని మోసం చేస్తోందా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మిలిటరీ స్లీప్ మెథడ్ నిజానికి 1981లో లాయిడ్ బడ్ వింటర్ తన ‘రిలాక్స్ అండ్ విన్’ అనే పుస్తకంలో పరిచయం చేసిన సాంకేతికత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ నేవీ పైలట్లు తీవ్రమైన ఒత్తిడిలో కూడా నిద్రపోవడానికి దీనిని అభివృద్ధి చేశారు. ఆరు వారాల శిక్షణ పొందితే, తుపాకుల మోత మధ్య కూడా కేవలం రెండు నిమిషాల్లో నిద్రపోవచ్చని ఈ పద్ధతి చెబుతుంది.

ఏమిటీ మిలిటరీ స్లీప్ మెథడ్? ఇందులో ‘ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్’ అనే పద్ధతిని అనుసరిస్తారు.

  1. ముఖంలోని కండరాల నుండి మొదలుపెట్టి.. భుజాలు, చేతులు, కాళ్లను క్రమంగా వదిలేస్తూ పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకురావాలి.
  2. ఇలా శరీరం రిలాక్స్ అయినప్పుడు మెదడుకు నిద్రపోవాలనే సంకేతం అందుతుంది.

నిపుణుల హెచ్చరిక: రెండు నిమిషాల్లో నిద్రపోవచ్చనే వాదన ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • ఒత్తిడి పెరుగుతుంది: సాధారణంగా ఒక మనిషి నిద్రలోకి జారుకోవడానికి 5 నుండి 20 నిమిషాల సమయం పడుతుంది. వెనువెంటనే నిద్రపోవాలని ప్రయత్నించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, నిద్రలేమి సమస్య మరింత తీవ్రమవుతుందని డాక్టర్ అలిసన్ బ్రెగర్ పేర్కొన్నారు.
  • సైనికులకు మాత్రమే సాధ్యం: సైనికులు తీవ్రమైన శారీరక శ్రమ చేస్తారు కాబట్టి వారు త్వరగా అలసిపోయి నిద్రపోతారు. సాధారణ వ్యక్తులకు ఇదే ఫలితం రాకపోవచ్చు.

మంచి నిద్ర కోసం చిట్కాలు:

  • బయోలాజికల్ క్లాక్: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం వల్ల మీ శరీరం ఒక క్రమపద్ధతికి అలవాటు పడుతుంది.
  • పగటి నిద్ర వద్దు: పగలు చిన్నపాటి నిద్రను (Naps) నివారించడం వల్ల రాత్రి త్వరగా నిద్రపడుతుంది.
  • డిజిటల్ డిటాక్స్: పడక గదిలో ఫోన్ వాడటం మానేసి, పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు మెదడుకు విశ్రాంతిని ఇస్తాయి.

Posted

in

by

Tags: