రైతుల యుద్ధ ట్యాంకర్ – బెలారస్ ట్రాక్టర్ ఎందుకు ఇష్టం?

భారత రైతులకు బెలారస్ ట్రాక్టర్ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. 1970–80 దశకంలో సోవియట్ యూనియన్ నుంచి భారత్‌కు వచ్చిన ఈ ట్రాక్టర్‌ను రైతులు “యుద్ధ ట్యాంకర్” అని పిలుస్తారు. ఇప్పటికీ పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేలాది MTZ-50, MTZ-80 ట్రాక్టర్లు రోజూ పొలాల్లో పనిచేస్తున్నాయి.

ఎందుకు ఈ ట్రాక్టర్‌ ?
  • బుల్లెట్ ప్రూఫ్ లాంటి బిల్డ్ క్వాలిటీ
  • బరువైన ఐరన్ ఫ్రేమ్, గట్టిగా పట్టే టైర్లు
  • రాత్రి–పగలు, వర్షం–ఎండ లెక్కచేయకుండా పనిచేస్తుంది
  • ఎలక్ట్రానిక్ సెన్సార్లు లేకపోవడంతో ఎప్పుడూ ఆగదు
పాతకాలం vs ఇప్పటి ధరలు

1975లో – ₹25,000 నుంచి ₹30,000 2025లో (సెకండ్ హ్యాండ్ మంచి కండీషన్) – ₹2.5 లక్షల నుంచి ₹4 లక్షలు

రైతుల అనుభవం

రైతులకు. “మహీంద్రా, సోనాలిక కంటే నాకు ఇదే ఇష్టం. ఒక్కసారి ఆయిల్ మార్చితే 3–4 ఏళ్లు ఎటువంటి ఖర్చు లేదు. భారీ దుక్కి, ట్రాలీ లాగడం, కొండలు ఎక్కడం ఈజీ

ముఖ్య స్పెసిఫికేషన్స్ (MTZ-50 / MTZ-80)
లక్షణంవివరాలు
ఇంజన్4 సిలిండర్ డీజిల్, 55–80 హెచ్‌పీ
ఇంధన ట్యాంక్130 లీటర్లు (రాత్రంతా పని చేయొచ్చు)
లిఫ్ట్ కెపాసిటీ1800–2000 కేజీలు
టైర్లుఆటోమేటిక్ గాలి నింపే సిస్టమ్
మైలేజ్గంటకు 5–6 లీటర్ల డీజిల్ మాత్రమే
స్పేర్ పార్ట్స్గుంటూరు, విజయవాడ, పంజాబ్‌లో సులభంగా దొరుకుతాయి
ఈ రోజుల్లో కూడా ఎందుకు కొనుగోలు చేస్తున్నారు?
  1. కొత్త ట్రాక్టర్లలో ఎలక్ట్రానిక్ సమస్యలు ఎక్కువ
  2. సెన్సార్ ప్రాబ్లమ్ వల్ల పొలంలోనే ఆగిపోతాయి
  3. బెలారస్‌లో అలాంటి భయం లేదు – కేవలం మెకానికల్
  4. స్పేర్స్ చవకగా దొరుకుతాయి, మెకానిక్ ఎవరైనా రిపేర్ చేయగలరు
ముగింపు

కొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వస్తున్నా, స్మార్ట్ ఫీచర్లు వస్తున్నా… నిజమైన రైతు ఇంకా బెలారస్‌ను వదలడం లేదు.


Posted

in

by

Tags: