భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది ప్రయాణికులు ఇంటి నుంచే ఆహారాన్ని వండుకుని వెంట తీసుకెళ్లడం సర్వసాధారణం.
అయితే, ఓ మహిళ రైలు అప్పర్ బెర్త్‌పై కూర్చుని, పెద్ద పెద్ద గిన్నెలతో తెచ్చుకున్న చికెన్, అన్నాన్ని తన కుటుంబ సభ్యులకు ప్లేట్లలో వడ్డిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో, ఆ మహిళ పై బెర్త్‌పై కూర్చొని ఒక గిన్నెలోంచి అన్నం, మరో గిన్నెలోంచి చికెన్ కూరను ప్లేట్లో వేసి కింద కూర్చున్న తన కుటుంబ సభ్యులకు అందిస్తూ కనిపించింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు “రైళ్లలో అమ్మే అపరిశుభ్రమైన ఆహారాన్ని తినడం కంటే, ఇలా ఇంట్లోనే వండుకుని తెచ్చుకుని తినడం ఎంతో మేలు” అంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో మరికొందరు, “పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రతకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా నడుచుకోవాలి” అని విమర్శిస్తున్నారు.
