ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై జరిగిన కాల్పుల యత్నం కేసులో, ఆయుధాలను అక్రమంగా తరలించారనే ఆరోపణలతో ఇద్దరు మహిళలతో సహా మరో నలుగురిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టుల పరంపర:
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ (23), బబితా (23) అనే ఇద్దరు మహిళలతో పాటు, హర్యానాకు చెందిన కునాల్, సుమిత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టకాగా, తాజాగా అరెస్టైన వారి సంఖ్య 7కి చేరింది.
రైలు మార్గంలో ఆయుధాల తరలింపు:
పోలీసుల విచారణ ప్రకారం.. రాధ మరియు బబితాలు రైలులో సాధారణ ప్రయాణికులా ప్రయాణించి, ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆయుధాలను ముంబైకి చేరవేశారు. అక్కడ క్రిమినల్ గ్యాంగ్‌కు చెందిన ఒకరికి ఆయుధాలను అందజేసి తిరిగి వస్తున్న సమయంలో దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వారిని అదుపులోకి తీసుకుంది. ఇక, కునాల్ మరియు సుమిత్‌లు ఆ ఆయుధాలను రిసీవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు:
రాధ మరియు బబితాలు హర్యానాలోని సోనిపట్‌లో బేకరీ పని చేస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, ఆజమ్‌గఢ్‌కు చెందిన బబితా వయస్సు 23 ఏళ్లు. ఈ ఇద్దరూ కుఖ్యాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా తరఫున ఆయుధాలను ఒక చోటి నుండి మరో చోటికి రవాణా చేసే ప్రమాదకరమైన పనిలో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది.
ఇతర ప్రముఖుల ఇళ్లపై కూడా నిఘా:
ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంఘటన సమయంలో టైగర్ ష్రాఫ్ ముంబైలో లేకపోవడంతో, అక్టోబర్ 11న జరగాల్సిన దాడి విఫలమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, అరెస్టయిన షూటర్లు సినిమా రంగానికి చెందిన మరికొո మంది ప్రముఖుల ఇళ్లను కూడా రెక్కీ నిర్వహించి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి సంచరించబడ్డాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Leave a Reply