“రోజుకు రూ.2.70 లక్షలా? ఆకాశాన్నంటే ఎత్తు.. లక్షల్లో అద్దె.. లండన్‌లో సీఎం విజయ్ బస చేసిన విలాసవంతమైన లగ్జరీ హోటల్.!!”

పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బస చేసిన విలాసవంతమైన హోటల్ అద్దె, దాని ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

యూరప్‌లోని అత్యంత ఎత్తైన, ప్రసిద్ధ భవనాల్లో ఒకటైన లండన్ బ్రిడ్జ్ సమీపంలోని ‘ది షార్డ్’ (The Shard) టవర్‌లో 34 నుంచి 52వ అంతస్తుల వరకు విస్తరించి ఉన్న ప్రఖ్యాత ‘షాంగ్రీ-లా ది షార్డ్’ (Shangri-La The Shard) స్టార్ హోటల్‌లో సీఎం విజయ్ బస చేశారు. ఈ హోటల్ గదుల నుంచి థేమ్స్ నదితో పాటు లండన్ నగర సంపూర్ణ సౌందర్యాన్ని వీక్షించవచ్చు. అత్యాధునిక సౌకర్యాలు, ఆటోమేటిక్ బ్లాక్‌అవుట్ స్క్రీన్లు, ప్రత్యేక పార్టీ హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సకల హంగులు కలిగిన ఈ హోటల్‌లో ఒక్క రోజు బస అద్దె భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.96,000 నుంచి రూ.2.70 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

ఈ 6 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా, రాబోయే 15వ తేదీన లండన్‌లో స్థిరపడిన ప్రవాస తమిళులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడనున్నారని సమాచారం.


Posted

in

by

Tags: