రోడ్డు రోమియోలకు చుక్కలు చూపించిన పోలీసులు: అమ్మాయిలను ఏడిపిస్తే ఏమౌతుందో చూడండి.. వీడియో వైరల్!

బైక్‌పై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాలేజీ విద్యార్థినులను వేధించిన ఇద్దరు యువకుల కథ చివరకు ఏమైందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఈ మధ్య కాలంలో ఇటువంటి ‘రోడ్డు రోమియో’ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సినిమా స్టైల్‌లో బైక్‌పై వచ్చి వెళ్లే అమ్మాయిలను వేధించడమే హీరోయిజం అని ఈ యువకులు భ్రమిస్తున్నారు.

అసలేం జరిగింది? ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినుల జుట్టు పట్టుకుని లాగడం, అసభ్యంగా తాకడం వంటి పనులు చేస్తూ వేధించారు.

పోలీసుల ‘స్పెషల్ ట్రీట్మెంట్’: అయితే, ఈ యువకుల హీరోయిజం ఎంతో సేపు సాగలేదు. కొద్ది క్షణాల్లోనే వారు పోలీసుల అతిథులుగా మారారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారికి ‘స్టేషన్ స్టైల్‌లో’ దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ యువకులు తమ తప్పు తెలుసుకుని, చెవులు పట్టుకుని క్షమాపణలు చెబుతున్న వీడియోను పోలీసులు చిత్రీకరించి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: