సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఉద్యోగ అన్వేషకులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. లింక్డ్ఇన్లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి, వాటికి దరఖాస్తు చేసుకునే వారిని ‘Grass Call’ అనే యాప్ను ఇన్స్టాల్ చేయమని కోరుతున్నారు.
మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసిన వెంటనే, మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోని డేటా, బ్యాంక్ వివరాలు మరియు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని వారు సులభంగా దొంగిలిస్తున్నారు.
ఇకపై ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.
ముఖ్య గమనికలు
యాప్ పేరు: ‘Grass Call’ వంటి తెలియని యాప్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి.
అధికారిక వెబ్సైట్: ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసే ముందు, ఆ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆ నోటిఫికేషన్ నిజమో కాదో సరిచూసుకోండి.
వ్యక్తిగత వివరాలు: ఓటిపి (OTP)లు లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయకండి.
