కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం (Fatty Liver) అనేది మొదట్లో చిన్న సమస్యగా అనిపించినా, తర్వాత తీవ్ర రూపం దాల్చవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
కాలేయానికి మేలు చేసే ఆహారాలు:
- అక్రోట్లు (Walnuts): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కాలేయ ఎంజైమ్‌లను మెరుగుపరచడమే కాకుండా, పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. రాత్రిపూట నానబెట్టిన అక్రోట్లు ఉదయాన్నే తినడం శ్రేయస్కరం.
- బాదం (Almonds): విటమిన్-E, ఫైబర్ మరియు హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి, తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.
- పిస్తా (Pistachios): యాంటీ ఆక్సిడెంట్లు మరియు మంచి కొవ్వులు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించి కాలేయంపై ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
- పెకాన్ నట్స్ (Pecan Nuts): వీటిలోని విటమిన్-E మరియు యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వాపును (Inflammation) తగ్గించడానికి మరియు కణాలు దెబ్బతినకుండా రక్షించడానికి తోడ్పడతాయి.
- పసుపు (Turmeric): పసుపులోని ‘కర్కుమిన్’ కాలేయంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వల్ల కాలేయ కణాలు బాగుపడతాయి.
- నిమ్మకాయ (Lemon): దీనిలోని విటమిన్-C మరియు సిట్రిక్ యాసిడ్ కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం సహజమైన ‘డిటాక్స్’ లా పనిచేస్తుంది.
