దక్షిణ అమెరికా దేశమైన పెరూలో డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు, పోలీసులు రోగి మరియు పాఠశాల విద్యార్థుల మారువేషాల్లో వెళ్లి మెరుపు దాడి (రైడ్) నిర్వహించిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
శాన్ జువాన్ డి మిరాఫ్లోరెస్ ప్రాంతంలోని ఒక ఇంట్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయని అందిన రహస్య సమాచారం మేరకు, పోలీసులు ఈ వినూత్న ఆపరేషన్‌కు పథక రచన చేశారు.
ఆ ఇంటి సమీపంలో ఒక పాఠశాల, ఆసుపత్రి ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ఒక పోలీసు అధికారి వీల్‌చైర్‌లో కూర్చున్న రోగిలాగా, మిగిలిన సిబ్బంది స్కూల్ విద్యార్థుల మాదిరిగా మారువేషాల్లో అక్కడికి చేరుకున్నారు.
సరైన సమయం రాగానే, వీల్‌చైర్‌లో రోగిలా నటిస్తున్న పోలీసు అధికారి అకస్మాత్తుగా పైకి లేచి, తన వద్ద దాచి ఉంచిన సుత్తితో ఆ ఇంటి ఇనుప తలుపును బద్దలు కొట్టి లోపలికి దూసుకెళ్లిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
ఈ ఆకస్మిక సోదాల అనంతరం ‘లాస్ చాంటురోన్స్ డి శాన్ జువాన్’ అనే ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఆపరేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Reply