లెజ్బియన్ రిలేషన్‌షిప్‌కు నిరాకరించినందుకు మేనకోడలిని చంపిన అత్త.. ఒళ్లు గగుర్పొడిచే కథనం.

బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు అత్త అయ్యే ఒక యువతి తన మైనర్ మేనకోడలిని అత్యంత క్రూరంగా హత్య చేసింది. ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతలుపూర్ గ్రామంలో 16 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

రుద్రాక్ష మాలతోనే గొంతు నులిమి హత్య పోలీసుల ప్రాథమిక విచారణలో బాలికను గొంతు నులిమి చంపినట్లు తేలింది. కాజల్ అనే యువతి (వరుసకు అత్త) ఈ హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక మెడలో ఉన్న రుద్రాక్ష మాలతోనే ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

పోలీసుల దర్యాప్తు – ఫోరెన్సిక్ బృందం రంగంలోకి సమాచారం అందుకున్న ముఫస్సిల్ పోలీసులు మరియు ఎఫ్ఎస్‌ఎల్ (FSL) బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముంగేర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

కాజల్‌పై గ్రామస్థుల తీవ్ర ఆరోపణలు నిందితురాలు కాజల్ గత కొంతకాలంగా బాలికపై ఒత్తిడి తెస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఆర్థిక సహాయం చేస్తానని నమ్మబలికి గ్రామంలోని యువతులను, మహిళలను ట్రాప్‌లో పడేస్తుందని, వారితో అనైతిక పనులు (లేజ్బియన్ సంబంధాలు) చేయాలని బలవంతం చేస్తుందని ఆరోపించారు. దీనిని నిరసించినందుకే మైనర్ బాలికను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సదర్ డిఎస్‌పి అభిషేక్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితురాలు కాజల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: