లేట్ నైట్ డెలివరీకి వెళ్లిన జొమాటో బాయ్.. కస్టమర్ గద్దించడంతో అక్కడే కూర్చుని ఆర్డర్ తినేశాడు!

ఒక జొమాటో డెలివరీ బాయ్ అర్థరాత్రి పూట ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే, కస్టమర్ అతనితో దురుసుగా మాట్లాడి, డబ్బుల గర్వంతో పైకి రమ్మని బలవంతం చేశాడు. దీనికి కోపం వచ్చిన డెలివరీ బాయ్, పైకి వెళ్లకుండానే కింద కూర్చుని కస్టమర్ ఆర్డర్‌ను తినేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఏం జరిగింది? వైరల్ అవుతున్న వీడియోలో అంకుర్ అనే డెలివరీ బాయ్ తన ఆవేదనను ఇలా వ్యక్తపరిచాడు: “కస్టమర్ నాపై అరుస్తూ పైకి రమ్మంటున్నాడు. ‘డబ్బులు తీసుకోవా? పైకి రా’ అంటూ గద్దిస్తున్నాడు. మేము డబ్బులు తీసుకుంటున్నాం కానీ నీ దగ్గర నౌకరీ చేయడం లేదు. అర్థరాత్రి 2:30 గంటలకు ఇంత దూరం వచ్చి నీకు తిండి అందిస్తున్నందుకు కనీసం కృతజ్ఞత ఉండాలి. ఇంత రాత్రి పూట నా బైక్ వదిలేసి పైకి వస్తే, ఒకవేళ బైక్ దొంగతనం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?”

ఆర్డర్ క్యాన్సల్ చేసి అక్కడే తింటూ.. కస్టమర్ ఆర్డర్ క్యాన్సల్ చేయమని చెప్పడంతో, అంకుర్ అక్కడే కూర్చుని ఆ బాక్సులోని గులాబ్ జామున్ తినడం మొదలుపెట్టాడు. తన దగ్గర బిర్యానీ కూడా ఉందని, దాన్ని కూడా తానే తింటానని వీడియోలో చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం రెండు వారాల్లోనే 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.


Posted

in

by

Tags: