వదినతో ఆడపడుచు అసహజ సంబంధం; అడ్డువచ్చిన తల్లి, అన్నను కడతేర్చిన వైనం – యమునానగర్‌లో షాకింగ్ మర్డర్ మిస్టరీ!

హర్యానాలోని యమునానగర్‌లో జరిగిన తల్లి, కుమారుడి హత్య కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది మరెవరో కాదు, ఆ ఇంటి కూతురు కాజల్. ఆజాద్ నగర్‌లో నివాసం ఉంటున్న మీనా (45), ఆమె కుమారుడు రాహుల్ (24)లను కాజల్ అత్యంత కిరాతకంగా చంపేసింది. మొదట ఎవరో దోపిడీ దొంగలు వచ్చి చంపేశారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినా, విచారణలో అసలు నిజం బయటపడింది.

స్నేహితురాలితో వికృత బంధం

కాజల్ స్వభావరీత్యా ‘లెస్బియన్’. ఆమె తన వికృత కోరికలు తీర్చుకోవడానికి తన స్నేహితురాలిని తన మేనబావ అయిన క్రిష్‌తో వివాహం చేయించింది. తద్వారా ఆ స్నేహితురాలు ఎప్పుడూ తన చెంతనే ఉండేలా ప్లాన్ చేసింది. రాత్రిపూట ఆ స్నేహితురాలు భర్త దగ్గర కాకుండా కాజల్ గదిలోనే పడుకునేది. ఇదే విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. కాజల్ అబ్బాయిలా వేషధారణతో ఉండేదని, వదినతో భార్యాభర్తల్లా ప్రవర్తించేదని ఆమె పిన్ని కిరణ్ వెల్లడించింది.

అన్న పెళ్లిని కూడా చెడగొట్టింది

కాజల్ తన అన్న రాహుల్‌కు కూడా తన మరో స్నేహితురాలితో పెళ్లి చేయించింది. ఆమెతో కూడా కాజల్ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయం బయటపడి ఆ పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత రాహుల్‌కు కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేశారు. కాజల్ రెండో వదినను కూడా లోబరుచుకోవడానికి ప్రయత్నించడంతో, ఆమె భయపడి పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆస్తి కోరిక.. మేనబావతో కలిసి హత్య

వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలతో తల్లి మీనా తన ఆస్తిని మొత్తం కొడుకు రాహుల్ పేరు మీద రాస్తుందేమోనని కాజల్ భయపడింది. తన అక్రమ సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఆస్తి దక్కదనే భయంతో తన మేనబావ క్రిష్‌తో కలిసి తల్లిని, అన్నను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది.

దొరికిపోయిన నిందితురాలు

పోలీసులు కాజల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. దీంతో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఆస్తిపై ఉన్న అత్యాశ, తన స్నేహితురాలితో ఉన్న అక్రమ బంధానికి అడ్డు తొలగించుకోవడానికే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది.


Posted

in

by

Tags: