“వయసు మీద పడినా అలవకుండా కారు కడుగుతున్న బామ్మ!” ముంబై వీధుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇచ్చిన ఊహించని నగదు బహుమతి!.. వైరల్ అవుతున్న వీడియో..!!!

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రద్దీ వీధుల్లో మానవత్వంపై నమ్మకాన్ని మరింత పెంచేలా జరిగిన ఒక హృదయపూర్వక ఘటన ప్రస్తుతం నెటిజన్ల కంటతడి పెట్టిస్తోంది.

సాధారణంగా వృద్ధాప్యం అనేది కుటుంబ సభ్యుల ఆదరణతో, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ గడపాల్సిన సమయం. కానీ, పూట గడవటం కోసం, కడుపు నింపుకోవడం కోసం వయసు మీద పడిన సమయంలో కూడా కష్టపడి పనిచేసే అభాగ్యుల జీవితం ఎంత దయనీయంగా ఉంటుందో ఈ ఘటన కళ్లకు కట్టింది.

నడుము వంగిపోయినా కూడా ఏమాత్రం అలసిపోకుండా ఆ నగర వీధుల్లో కార్లు కడుగుతూ, దాని ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి పోరాటం చాలా మందిని ఆలోచింపజేసింది.

సోషల్ మీడియాలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ కంటెంట్ క్రియేటర్ హుస్సేన్ మన్సూరి అనుకోకుండా ఆ బామ్మను గమనించినప్పుడు ఈ ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. ఆమెకు నేరుగా వెళ్లి డబ్బులు ఇవ్వడానికి బదులుగా, చాలా గౌరవప్రదమైన రీతిలో ఆమె వద్దకు వెళ్లి తన కారుపై ఉన్న ఒక మరకను తుడిచిపెట్టమని అడిగాడు.

నిజానికి ఆ మరక కావాలనే చేసినప్పటికీ, ఆ బామ్మ ఏమాత్రం విసుక్కోకుండా ఎంతో అంకితభావంతో ఆ పనిని పూర్తి చేసింది. పని పూర్తయిన వెంటనే ఆమె ఏమాత్రం ఊహించని విధంగా నగదు బహుమతితో పాటు ఒక కొత్త చీరను ఇవ్వడంతో, అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యపోయిన ఆ బామ్మ కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ఆ దృశ్యం చూసే ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.

ఈ అద్భుతమైన క్షణాన్ని రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియో, అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు 1 కోటీ 60 లక్షలకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

ఈ వీడియోను చూసిన లక్షలాది మంది నెటిజన్లు, నేటి యాంత్రిక ప్రపంచంలోనూ మానవత్వం ఇంకా బతికే ఉందని ప్రశంసిస్తున్నారు. వృద్ధాప్యంలో ఇలా కష్టపడాల్సిన పరిస్థితిలో ఉన్న పేదవారికి తగిన సహాయం అందాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా, అభాగ్యుల కన్నీళ్లు తుడిచి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించే ఇటువంటి చిన్న చిన్న సాయాలు మానవత్వంపై మనకున్న నమ్మకాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *