వయస్సు 30 దాటితే చాలు.. అప్పుడే పురుషులు అంకుల్స్ లా కనిపిస్తున్నారు! ఎందుకు ఇలా?

మనలో కొందరు చిన్న వయస్సులోనే వయస్సు పైబడిన వారిలా కనిపిస్తారు. మరికొందరు వయస్సు పెరిగినా ఇంకా యంగ్ గానే కనిపిస్తుంటారు. ముఖ్యంగా పురుషుల విషయంలో చూస్తే, 30 ఏళ్లు దాటగానే చాలా మంది ముసలివారిలా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా మహిళలు పురుషుల కంటే సగటున 5 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఎవరికి త్వరగా వయస్సు పైబడినట్లు కనిపిస్తుంది? సైన్స్ ప్రకారం దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

1. హార్మోన్ల ప్రభావం: పురుషులలో టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ కండరాలు, ఎముకల బలం మరియు శారీరక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల శరీరం బలహీనపడటం, పొట్ట భాగంలో కొవ్వు పెరగడం, నిరాశ (Depression) వంటి లక్షణాలు కనిపిస్తాయి. టెస్టోస్టెరాన్ వేగంగా తగ్గడం వల్ల పురుషులు త్వరగా వయస్సు మళ్ళిన వారిలా కనిపిస్తారు.

2. మెదడు పనితీరు: పరిశోధనల ప్రకారం, మహిళల మెదడుతో పోలిస్తే పుರುషుల మెదడు వేగంగా వయస్సు పైబడిన లక్షణాలను ప్రదర్శిస్తుంది. జీవనశైలి, ఒత్తిడి మరియు సామాజిక సంబంధాలు దీనిపై ప్రభావం చూపుతాయి.

3. పోషకాహార లోపం: విటమిన్లు మరియు ఖనిజాల లోపం వల్ల ముఖంపై ముడతలు రావడం, త్వరగా అలసిపోవడం వంటివి జరుగుతాయి. ఇది ఒక వ్యక్తిని ఉన్న వయస్సు కంటే పెద్దవారిలా చూపిస్తుంది.

4. డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం): శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారిపోయి ముడతలు వస్తాయి. ఇది వయస్సును ఎక్కువగా చూపిస్తుంది.

5. ఒత్తిడి (Stress): అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మ కణాల పునరుత్పత్తిని అడ్డుకుంటుంది, ఫలితంగా వయస్సు పెరిగినట్లు కనిపిస్తారు.

6. అధిక తీపి పదార్ధాలు: ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఇన్సులిన్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.


Posted

in

by

Tags: